Thursday, 5 November 2026

పట్టణంలో తమ సొంత నిధులతో బోర్లకు మరమ్మత్తులు చేపించి కాలనీవాసులకు నీరు అందించిన

పట్టణంలో తమ సొంత నిధులతో బోర్లకు మరమ్మత్తులు చేపించి కాలనీవాసులకు నీరు అందించిన కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు 9వ వార్డులోని ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు గురై పనిచేయని బోర్లను కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి తమ సొంత నిధులతో బోర్లను మరమ్మత్తులు చేయించి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు 9వ వార్డులో పర్యటించి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి పనిచేయని బోర్లను మరమ్మత్తులు చేయించి కొత్త పైపులు బిగించి కరెంటు కలెక్షన్ ఇప్పించి బోర్లు పనిచేసే విధంగా తమ సొంత డబ్బులతో వార్డు ప్రజలకు నీరు అందించారు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను గుర్తించి పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు పసునూరు యుగేందర్ రెడ్డి తమ సొంత డబ్బులను ఖర్చు చేసి పట్టణ ప్రజలకు బోర్ల నీళ్లు అందించారని 9వ వార్డు ప్రజలతో పాటు కొండమల్లేపల్లి పట్టణ ప్రజలు ఆనందం హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి ప్రజాసేవ చేసే లక్షణాలు ఉన్న చురుకైన, యువ నాయకులు రాజకీయాలలో వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు