భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలి
మరిపెడ, జనవరి 14(జనం సాక్షి):ఈ నెల 18నా ఖమ్మం లో నిర్వహించే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు రేపు ఆదివారం మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హల్ లో నిర్వహించతలపెట్టిన నియోజకవర్గ స్థాయి సానహాక సమావేశంను విజయవంతం చేయాలని బీ అర్ ఏస్ పార్టీ మండల అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అయన మండలంలోని తానంచెర్ల గ్రామం లో మాట్లాడుతూ డోర్నకల్ శాసనసభ్యులు డీ ఏస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో జరిగే ఈ సన్నాహాక సమావేశం
లో ముఖ్య అతిధులుగా పంచాయత్ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , మహబూబాద్ ఎంపీ జిల్లా బీఅర్ ఏస్ అధ్యక్షురాలు శ్రీమతి మాలోత్ కవిత,జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,నియోజకవర్గ యువనాయకులు డీ ఏస్ రవి చంద్ర, పాల్గొటున్నట్లు అయన తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధి నుండి వందల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులాందరు హాజరై కార్యక్రమం ను విజయవంతం చేయాలని సూచించారు.
భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలి




