Thursday, 5 November 2026

మేకలసోంపల్లిలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఉపసర్పంచ్ జయమ్మ లోకేశ్వర్ రెడ్డి

మేకలసోంపల్లిలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ఉపసర్పంచ్ జయమ్మ లోకేశ్వర్ రెడ్డి

మల్దకల్ జనవరి 14 (జనంసాక్షి)గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం పరిధిలోని మేకల సోంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం ఎంపిఎల్ -1క్రికెట్ టోర్నమెంట్ ను మేకలసోంపల్లి ఉపసర్పంచ్ జయమ్మ లోకేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రతి యువకుడు విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి,క్రికెట్, కబడ్డీ లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎదగాలన్నారు.ప్రతి ఒక యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి,క్రీడల వల్ల మనకు శారీరకంగా మానసికంగా దృఢత్వం లభిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కబడ్డీ తోపాటు ప్రతి ఒక్కరు క్రికెట్ క్రీడల్లో మంచి ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర,జాతీయస్థాయిలో మంచి క్రీడా ప్రదర్శించాలన్నారు.
ప్రతి ఒక్క క్రీడాకారులు సోదరుభావంతో కలిసిమెలిసి కీడును ప్రదర్శించాలి అని పేర్కొన్నారు.క్రీడా ప్రాంగణానికి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ రెడ్డి, శీనురెడ్డి,రాజు రెడ్డి,జగదీష్, రఫీ,అంజి,తిమ్మప్ప, రామచంద్ర,చందర్,నరసింహ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.