Wednesday, 4 November 2026

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరులకు ఘన నివాళులర్పించిన ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్

బోయిన్ పల్లి జూన్ 22 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయం లో ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఎంపిపి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశం లో అమరవీరుల సంస్మరణ తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల త్యాగాలు వెలగట్టలేని వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నరేష్ ,ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, కొ ఆప్షన్ సభ్యులు ఆజ్జు, ఎంపీఓ గంగ తిలక్, సూపర్డెంట్ రవీందర్, ఎంపీటీసీ లు అక్కనపల్లి ఉపేందర్, సంభ బుచ్చమ్మ, ఈడుగురాజేశ్వరి, కొనుకటి శిరీష ఐరెడ్డి గీతారెడ్డి,నాయకులు ఈడుగు స్వామి సంభలక్ష్మరాజ్యం కంకణాల పురుషోత్తమ రెడ్డి డబ్బు సృజన రెడ్డి ,ఏమిరెడ్డిమల్లారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.