Tuesday, 3 November 2026

పట్టణంలో వడదెబ్బతో ఇద్దరు మృతి – పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి – షేక్ మన్సూర్అలీ

హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): గత వారం రోజుల నుండి హుజూర్ నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. సోమవారం ఆ క్రమంలోనే హుజూర్ నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ కు చెందిన పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ వయస్సు (60) సంవత్సరాలు, పట్టణంలోని దద్దనాల చెరువుకు చెందిన పేద ముస్లిం పఠాన్ ముస్తాక్ ఖాన్ వయసు (74) సంవత్సరములు రోజువారి కూలీ పనులకు, బ్యాటరీ రిపేర్ పనులకు వెళ్లి అధిక ఉష్ణోగ్రతలకు గురి అయ్యి విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలతో పూర్తిగా నిరసించి బీపీ పడిపోయి వడదెబ్బతో మరణించినారు. వడదెబ్బ మృతుల సమాచారాన్ని హుజూర్ నగర్ అధికారులకు తెలియజేయడం జరిగింది. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మృతుల కుటుంబాల దగ్గరకు వచ్చి మరణించిన వారిని పరిశీలించి విచారణ చేశారు. ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ, షేక్ సైదా లు మాట్లాడుతూ పేద వితంతు భవన నిర్మాణ కార్మికురాలి కుటుంబానికి, పేద ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. వడదెబ్బతో అకాల మరణం చెందిన వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐల వెంకన్న గౌడ్, ములకలపల్లి నరసింహారావు, పఠాన్ గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.