సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి, మే 29 : – ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కరిష్కారం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ శరత్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. వారు తమ సమస్యలను విన్నవిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదులను అందజేశారు. గ్రీవెన్స్ హాల్లో రెవిన్యూ డివిజనల్ అధికారి అంబదాస్ ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.ప్రజావాణికి మొత్తం 39 ఆర్జీలు రాగా, అందులో 12 రెవిన్యూ శాఖకు సంబంధించినవని, 27 ఇతర శాఖలకు సంబంధించిన ఆర్జీలని తెలిపారుఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




