భైంసా రూరల్ ఏప్రిల్ 07జనం సాక్షి నిర్మల్ జిల్లా బైంసాపదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరయ్యింది. గురువారం రాత్రి హనుమ కొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి బండి సంజయ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ మంజూరైన నేపథ్యంలో శుక్రవారం ఉదయం బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. బండికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ డివి జన్ కేంద్రమైన బైంసాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. గురువారం రాత్రి 10.30 గంటలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్, ప్రతినిధి గోపాల్ సూ సుత్రావేల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక గణేష్ నగర్ హన్మాన్ మందిర్ వద్ద టపాసులు వెల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. బండి సంజయ్ కు అనుకూలంగా ,కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ప్రజాస్వా మ్యాన్ని అపహస్యం చేసే రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు కు బండి సంజయ్ బెయిల్ చెంపపెట్టులాంటిదని బీజేపీ భైంసా పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్వర్ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపకాలను అణగదొక్కి నిజాం తరహాలో పాలనను కొనసాగించాలనుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్ కు ప్రజానీకం త్వర లోనే సరియైన రీతిలో గుణపాఠం నేర్పముందని జోస్యం చెప్పారు.




