పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కస్తాల సైదులు ఏకగ్రీవ ఎన్నిక హుజూర్ నగర్ జనవరి 7 (జనంసాక్షి) : హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కస్తాల సైదులుని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తుంచుకుంటామని కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు వెన్నెముకలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతోమంది దళితులకు ఉద్యోగ, వ్యాపార, స్వయం ఉపాధి కొరకు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చామన్నారు. ప్రత్యేకంగా కస్తాల సైదుల్ని అభినందిస్తూ పార్టీ కోసం కష్టపడాలన్నారు. అనంతరం కస్తాల సైదులు , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్ల ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కల నాగరాజు, కోల్లపూడి యోహాన్, మేళ్లచెరువు ముక్కంటి, ఎడవెల్లి వీరబాబు , కస్తాల సైదులు, కందుకూరి రాము తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కస్తాల సైదులు ఏకగ్రీవ




