Wednesday, 4 November 2026

విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్, విజర్డ్, రాతాంశాల పరీక్షలు

విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్, విజర్డ్, రాతాంశాల పరీక్షలు

టేకులపల్లి,జనవరి 7 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమ శేఖర్ శర్మ ఆదేశానుసారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లి లో ఇ ఎల్ టి ఎ కన్వీనర్ బాలు మాలోత్, కో-కన్వీనర్ జానకి ఆధ్వర్యంలో శనివారం హైస్కూల్ విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్, విజర్డ్, రాతంశాల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భద్రు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో , ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ మండల కన్వీనర్ బాలు నాయక్, కో కన్వీనర్ జానకి ఆంగ్ల ఉపాధ్యాయులు రవీందర్, సురేష్, పాపారావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.