పట్టణ కేంద్రంలో కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్సై నారాయణరెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 27 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం నాడు వివిఆర్ ఫంక్షన్ హాల్ వెనుక తిరుమల నగర్ సాగర్ రోడ్ లో కోండ్రపల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగే కరాటే క్లాసులను కొండమల్లేపల్లి సిఐ రవీందర్ మరియు ఎస్ఐ నారాయణరెడ్డి లు ఘనంగా కరాటే శిక్షణ కేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వలన ఆరోగ్యానికి, ఆత్మ రక్షణకు, మానసిక వికాసానికి, కరాటే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కరాటే నేర్చుకోవడం వలన శరీరం దృఢంగా ఉంటుందని మనిషి ఎంతో ఉల్లాసంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటారని సాధ్యమైనంతవరకు కరాటే నేర్చుకుంటే బాగుంటుందని తెలిపారు కరాటే లో తర్ఫీదు పొందటానికి విద్యార్థులు చాలా ఆసక్తి చెబుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కొండ్రపల్లి సురేష్ మాట్లాడుతూ కరాటేలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన కోఠి మాస్టర్ కొండమల్లేపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంతో మందికి కరాటే శిక్షణ ఇచ్చి స్పోర్ట్స్ కోట లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు మరియు కరాటే మాస్టర్స్ గా ఉపాధి పొందున్న వారు దేవరకొండ డివిజన్ లో వందలాది మంది వున్నారు మా గురువు కోటి మాస్టర్ లాగే నేను కూడా విద్యార్థులకు మంచి శిక్ష ఇచ్చి పేరు ప్రతిష్టలు పొందుతానని తెలిపారు కరాటే శిక్షణ కేంద్రానికి స్థలాన్ని సహకరించిన మా రెడ్డి మీనారెడ్డి చిన్న మారయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కరాటే క్లాసులు ఉదయం 5:30 గంటల నుండి 7.00 గంటల వరకు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు కరాటే క్లాస్ లకు సహకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఉపసర్పంచ్ గంధం సురేష్, డాక్టర్ రసూల్, వార్డు సభ్యులు ముడిగ శేఖర్ యాదవ్, మారెడ్డి బుచ్చిరెడ్డి, ఎండి మక్బూల్, మంటిపల్లి యాదయ్య వకీల్ సాబ్, దగ్గు వెంకన్న వకీల్ సాబ్, జోసెఫ్, శంకరయ్య, కొమిరిశెట్టి నరేందర్ తదితరులు పాల్గొన్నారు
పట్టణ కేంద్రంలో కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్సై నారాయణరెడ్డి




