Saturday, 7 November 2026

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్ : శామీర్ పేట్, జనం సాక్షి :
ఆదివారం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. వీరిరువురి పై ఐటి సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లకు మద్దతు గా కలిసినట్లు తెలిపారు. సోదాలు చేసే క్రమంలో మోత్తం కుటుంబానికి ఇబ్బంది కలిగించటం సరి కాదని అన్నారు. ఇందులో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు తాడెం కుమార్, మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
27ఎస్పీటీ -1: మంత్రి ని కలిసిన నాయకులు