పట్టణ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ లో ఉంది
– పాత్రికేయుల సమావేశం లొ కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి ప్రతినిధి జనవరి5 జనంసాక్షి;
పట్టణ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ లో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాలేదన్నారు. అభ్యంతరాలు ఉంటే రైతులు తెలుపాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల పేరిట ధరణి పోర్టల్ లో వారి పేర్లు ఉన్నాయని చెప్పారు. వారి భూములు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.




