మెట్పల్లిలో నూతన ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు
మెట్పల్లి టౌన్, జనవరి 05,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణంలో ఏడు కోట్ల నిధులతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అమలు చేస్తామని అన్నారు మెట్పల్లిలో ఎఎన్ఎం సబ్ సెంటర్ తెస్తామని అన్నారు తెలంగాణ రాకముందు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల ప్రసవాలు జరిగేవి ఇప్పుడు 2000 ప్రసవాలు జరుగుతున్నాయి . మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో డెంటల్ చైర్ మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , కలెక్టర్ జి.రవి , మున్సిపల్ ఛైర్మన్ సుజాత సత్యనారాయణ, జెడ్పీటీసీలు,ఎంపీపీలు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు
మెట్పల్లిలో నూతన ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు




