Thursday, 5 November 2026

రెడ్డి సంఘం భవనం మంజూరు కోసం ఎమ్మెల్యేకు వినతి

రెడ్డి సంఘం భవనం మంజూరు కోసం ఎమ్మెల్యేకు వినతి
******
సైదాపూర్, జనం సాక్షి డిసెంబర్28లస్మన్నపల్లి మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు రెడ్డి సంఘం ప్రతినిధులు వినతి పత్రం సమర్పించడం జరిగింది. బుధవారం హుస్నాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ను కలిసి నాయకులు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ బాబు సానుకూలంగా స్పందించి రెడ్డి సంఘం భవనానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, సర్పంచ్ కాయిత రాములు, రెడ్డి సంఘం అధ్యక్షులు కొట్టే వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, హనుమాన్ దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మ్యాకల రాజిరెడ్డి, యూత్ నాయకులు మ్యాకల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.