ఫోటో :- విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్న దృశ్యం…
రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పేద విద్యార్థులకు మాజీ విండో చైర్మన్ పత్తి రాము, బయో స్టార్ట్ ఎరువుల కంపెనీ ద్వారా 10 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించారు. ఈ సందర్భంగా బయోస్టార్ట్ కంపెనీ వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి వ్యవసాయం గురించి అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు. పంట పొలాలకు బయోస్టార్ట్ ఎరువుల మందులు, వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అంతే కాకుండా తమ లాభాల గురుంచి కాకుండా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేసిన మాజీ విండో చైర్మన్ పత్తి రామును అభినందించారు. అనంతరం విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ పత్తి రాము, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజూష, బయోస్టార్ట్ ప్రొడ్యూక్ట్ మేనేజర్ అమోల్ పవర్, రీజినల్ మేనేజర్ రంజిత్, ఫీల్డ్ ఆఫీసర్ ఎం.వి. కృష్ణారెడ్డి, ఎంఈవో కిరణ్, బిఎఫ్ఏ అవినాష్, పాఠశాల ఉపాధ్యాయులు,
విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




