ఈ నెల 8 న రాష్ట్రానికి రానున్న పీఎం నరేంద్ర మోడీకి నల్ల నేలలో నిరసనలు తెలియజేయడానికి బొగ్గు గని కార్మికులు సిద్ధం అవుతున్నారు! మొత్తం ఆరు జిల్లాల్లోని బొగ్గు గని కార్మికులు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరు కావాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు! పీఎం పర్యటనను వ్యతిరేకస్తున్నామని అన్నారు.కేంద్రం బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతూ,ధారాదత్తం చేయడం కు నిరసనగా,11 వ బొగ్గు గని కార్మికుల వేజ్ బోర్డు ను వెంటనే పరిష్కరించాలని,గౌతమ్ అదానికి ప్రయోజనం చేకూర్చాలని ఉద్దేశంతో అతని బొగ్గు గనుల నుంచి విదేశీ బొగ్గు ను 10 శాతం తప్పని సరిగా కొనాలని,నిబంధనలు పెట్టినందుకు నిరసనగా,సింగరేణి లోని అన్ని బొగ్గు బావుల్లో పీఎం కు వ్యతిరేకంగా నల్ల జెండాలు,నల్ల బ్యాడ్జిల నిరసన ఉంటుందని సితా రామయ్య పేర్కొన్నారు.




