Wednesday, 4 November 2026

రోడ్ల నిర్మాణానికి 3.88 కోట్లు మంజూరు సిఎం ,ఎమ్మె ల్ల్యే పోటోలకు పాలాభిషేకం

జుక్కల్, జనవరి 24, (జనంసాక్షి ),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలములోని శ్రీ రాం తండా,హన్మాన్ తండా, సిద్దాపూర్,మహిభాపూర్ గ్రామాల ప్రజలు బిటి రోడ్లు నిర్మానానికి నిదులు మంజూరు కావడంతో మంగళవారం ఆయా గ్రామాల ప్రజలు సంతోషంతో సిఎం కెసిఆర్, ఎమ్మె ల్ల్యే హన్మంత్ షిండే పోటోలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎంపిపి యశోద నీలు పాటిల్ మాట్లాడుతు జుక్కల్ ఎమ్మెల్ల్యే హన్మంత్ షిండే, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ కృషితో నిధులు మంజూరయ్యాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలసర్పంచులు , ఎంపిటిసిలు, ప్రజలు పాల్గొన్నారు.