Monday, 2 November 2026

మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్యపై విచారణ జరపాలి ప్రిన్సిపల్, హెచ్ ఓ డి  లపై చర్యలు తీసుకోవాలి * ప్రీతి కుటుంబాన్ని అందుకోవాలి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి * విద్యాలయాలలో,ర్యాగింగ్, మహిళలపై దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి* పి ఓ డబ్ల్యు  జిల్లా కార్యదర్శి శారద

 టేకులపల్లి, ఫిబ్రవరి 28( జనం సాక్షి): మెడికల్ విద్యార్ధి ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్ల ఆత్మహత్యకుపాల్పడిందని,కాలేజీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకొని వుంటే ప్రీతి సజీవంగా ఉండేదని, ప్రీతి ఆత్మహత్యపై వెంటనే విచారణ జరపాలని పి ఓ డబ్ల్యు  జిల్లా ప్రధాన కార్యదర్శి బయ్యా శారద  అన్నారు. ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగు జడ్జితో విచారణ జరపాలని,ఆత్మహత్యకు కారకుడని బావిస్తున్న సీనియర్ విద్యార్ధి సైపోపై హత్యనేరం క్రింద అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పి ఓ డబ్ల్యు జిల్లా కమిటీ సమావేశం ఇంటిక లక్ష్మి అద్యక్షతన టేకులపల్లిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శారద ప్రసంగిస్తూ దేశంలో,రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పసి పిల్లలు మొదలు, పండు వృద్దుల వరకు లైంగిక దాడులు సాగిస్తున్నారని, అధికార పార్టీనేతల అండదండలతో హంతకులు రక్షించ బడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎంతో భవిష్యత్తు ఉండి డాక్టర్ కాబోతున్న ప్రీతిపై వేధింపులు చేసి ఆత్మహత్యకు పురిగొల్పటం దుర్మార్గమైందన్నారు. జిల్లా కమిటి సమావేశంలో ముందుగా ప్రీతికి నివాళి అర్పించి, 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘసం (POW) జిల్లా గౌరవాద్యక్షులు నోముల కళావతి అద్యక్ష,కార్యదర్శులు,ఇంటిక లక్ష్మి,బయ్యా శారద,సహాయ కార్యదర్శి  మోకాళ్ళ సుగుణ,నాయకులు చిoత లాలమ్మ,రెళ్ళ నాగలక్ష్మి,సున్నం సుగుణ,మడవి సంధ్య తద�