హైదరాబాద్,(జనంసాక్షి): తనకు ఏ పదవీ వద్దని…. తెలంగాణ ఇస్తే చాలని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటానని తాను సోనియాగాంధీకి చెప్పినట్లు ప్రచారం జరగటం అర్థరహితమన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం అయ్యేవరకూ సీఎం పదవి వద్దని చెప్పినట్లు జానారెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం ఏ త్యాగం చేయటానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.




