Thursday, 5 November 2026

పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి.
-టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్.
జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి11(జనంసాక్షి):

పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రిడేషన్ కు సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు అక్రిడేషన్ కార్డు లేని వారికి కార్డులు జారీ చేయాలని,ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు కార్పొరేట్ ఆసుపత్రిలో అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. లింగాల మండల కేంద్రంలో పాత్రికేయులకు చూయించిన స్థలంలో పాత్రికేయులందరికి ఇండ్లు నిర్మించాలని కోరారు.ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు లింగాల మండల అధ్యక్షులు ఎం శ్రీనివాస్ యాదవ్,నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు వెంకటస్వామి,సీనియర్ జర్నలిస్టులు వెంకటస్వామి,శేఖర్,రఘుపతి రాథోడ్, శివాజీ,గుడి శ్రీనివాసులు,దేవేందర్, మన్సూర్,అరుణ్ కుమార్,రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.