రాజంపేట్ ఏప్రిల్ 8 (జనంసాక్షి) రాజంపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను రాజంపేట్ ఎస్సై రాజు శనివారం నాడు అకస్మాత్తుగా తనిఖీ చేశారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ ఇతర అవకతవకలు జరగకుండా పటిష్టంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నాడు రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామం లో జెడ్ పి హెచ్ స్కూల్ లలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను ఎంఈఓ, రామస్వామి లతో కలిసి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పక్డబందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలుక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఏ ఇతర ఎలక్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు. ఇన్విజిలేటర్ల మొబైల్ ఫోన్లు కూడ బయటే డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఇటీవల కొన్ని ప్రాంతాలలో పేపర్ లీకేజీ లాంటి సమస్యలు రావడంతో పరీక్షా నిర్వహణ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఇతరులు ఎవరు కూడా పరీక్ష కేంద్రాలలో రాకుండా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల సమీప ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు పరచడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పదవ తరగతి పరీక్ష నిర్వహణ అధికారులకు తెలిపారు.




