నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్ మే 10: బుధవారం నాడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నేరేడుచర్ల మండల కేంద్రoలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన తునికిపాటి.హరిణి 10/10 జీపీఏ తో స్టేట్ మొదటి ర్యాంకును సాధించిందని పాఠశాల కరస్పాండెంట్ కొనతం. సీతారాంరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బి.పూజిత,కే.శ్రీనిత, ఏ.సాయి స్నేహాలు 9.8 జిపిఏ ను,ఎస్కే. తబస్సుమ్ 9.7 జిపిఏను, టీ.కీర్తన, సిహెచ్.మేఘన,
ఏ.వైష్ణవి,పి.ఉదయ్ కుమార్ లు 9.5 జిపిఏ తో, 22 మందికి పైగా విద్యార్థులు 9.0 జిపిఎ ను సాధించారని తెలిపారు.10 జీపీఏను సాధించిన హరిణిని పాఠశాల కరస్పాండెంట్ కొణతం సీతారాం రెడ్డి,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు,పట్టణ ప్రముఖులు అభినందన తెలియజేశారు.




