Thursday, 5 November 2026

పది కోట్ల రూపాయలతో ఖానాపూర్ లో వంతెన నిర్మాణ పనులు

ఖానాపూర్ రూరల్ 9 మే (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకనే ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని రాష్ట్ర అటవీ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ నుండి తర్లపాడ్ వెళ్లే రెంకొని వాగు,కు 5 ఓట్ల 20 లక్షలు,అంబేద్కర్ నగర్ నుండి దిలార్పూర్ వెళ్లే రోడ్డు వంతెన వరకు 4 కోట్ల 70 లక్షల తో బిర్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన పనులు కొరకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలు పట్టణాలు చాలా చురుకుగా అభివృద్ధి చెందుతున్నాయని,ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి ఎమ్మెల్యే రేఖ నాయక్ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ ఛైర్మన్ కలిల్,మండల అధ్యక్షుడు రాజ గంగన్న,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్రె గంగధర్,కౌన్సులర్ కావలి సంతోష్,ఆర్ అండ్ బి డి ఈ మల్లా రెడ్డి,ఏ ఈ విజయ నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.