Thursday, 5 November 2026

యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

అలంపూర్ జూన్ 9(జనంసాక్షి) రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని, యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి ఎం అబ్రహం అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా శుక్రవారం అలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ యార్డ్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంక్షేమ దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహారదీక్ష చేసి చావు వరకు వెళ్ళి తెలంగాణ తెచ్చారు కేసీఆర్ అన్నారు.యావత్తు తెలంగాను కేసీఆర్ ఒక్కతాటిపై తీసుకొచ్చి సకల జనులు సమ్మె లో అన్నిరంగాల ప్రజలు పాల్గొని తెలంగాణను సాదించుకున్నాం అన్నారు.67 ఏళ్లు కాంగ్రెస్,బీజేపీ వాళ్ళు పాలించారు కానీ, ఆనాడుకేసీఆర్ ఇస్తున్న 2016 పెన్షన్ లేదు,గొర్రెల పంపిణీ,కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ లాంటి మరెన్నో పధకాలు నాటి పాలకులకు ప్రజలకు అందించడం చేతకాలేదు కనీసం ఆలోచన కూడా రాలేదు అన్నారు.తెలంగాణ సర్కారు కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి అండగా ఉంటున్నారు అన్నారు.
చేతి వృత్తులు చెనుకొనే 16కులాల వారికి లక్ష రూపాయలు అందించబోతుంది కేసీఆర్ ప్రభుత్వం అన్నా రు.
సిఎంఆర్ఎఫ్ ద్వారా పెదలను గొప్పగా ఆదుకుంటున్నాం,గృహాలక్ష్మి,చేనేత,ఒంటరి మహిళ,రైతన్నలకు రైతు బంధు లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ పేద ప్రజలను అందిస్తున్న ఏకైక సర్కారు తెలంగాణా సర్కార్ అన్నారు.కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు,కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి లబ్ధిదారులు అందరూ ప్రజలు వివరించాలి అన్నారు.పేద బిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు అందిస్తున్న, ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు.కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశం కోరుకుంటుంది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పనులు ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయ్ అంటే మన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వనా ఎంత గొప్పగా ముందుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు,మన రాష్ట్ర రైతుల గోస తీర్చి అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్ వెంట నడవాలని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం 67 సంవత్సరాలు పాలించిన నాయకులకు ఎందుకు చేతకాలేదు ఇన్ని పధకాలు ఎందుకు ఇవ్వలేదు అన్నారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కు అన్యాయం జరిగింది,నిధులు నియమాకాలు అన్ని ఆంధ్రల్లో దోచుకొని పోయిర్రు,అందుకే ప్రత్యేక రాష్ట్రం కోరుకుని సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకున్నాం అన్నారు.
పెదలను గొప్పగా ఎదిగే విదంగా చేసి నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.
నాడు తెలంగాణ ఎట్లా ఉంది నేడు ఎట్లా ఉంది అనేది మనమందరం బేరీజు వేసుకోవాలి చర్చ జరపాలి అన్నారు.సంక్షేమంతో లక్షలాది కుటుంబాలు తెలంగాణలో బాగుపడ్డాయి చాలా సంతోషంగా ఉంది,ఇంత గొప్పగా అభివృద్ధి,సంక్షేమ పధకాలు అందిస్తున్న కేసీఆర్ ని కాపాడుకుందాం అని అన్నారు. అనంతరం గొర్రెల పంపిణీ.
మహిళా సంఘం ద్వార 1 ట్రాక్టరుకుల వృత్తుల వారికి 1 లక్ష రూపాయల చెక్కుల పంపిణీ,
అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న మహిళా సంఘలకు 11.51 కోట్ల రూపాయల చెక్కు పంపిణీ.
సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వడ్డేపల్లి జెడ్పిటిసి రాజు, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మనోరమ , ఉండవెల్లి ఎంపీపీ బీసమ్మ ఎంపిడిఓలు రాఘవ, నాగేంద్రం, తహసీల్దార్లు సుబ్రహ్మణ్యం,సుభాష్ నాయుడు,లక్ష్మి, అధికారులు ధర్మారం సర్పంచ్ మధు నాయుడు, పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.