హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గతంలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కాంగ్రెస్ బలం పెరుగుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీలు అంగీకరించేది లేదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిక లేదు. తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. సీమాంధ్రలు వారి అభిప్రాయం వెలిబుచ్చడంలో తప్పులేదని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల తీరు వల్లే తెలంగాణ ఆగిపోయిందని గుత్తా తెలిపారు.




