Thursday, 5 November 2026

పద్మశాలి నూతన కమిటీ వేసిన: మండల అధ్యక్షుడు సత్యం

….

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పిలుపుమేరకు ధర్మపురి మండల అధ్యక్షుడు మచ్చ సత్యం, ఉపాధ్యక్షుడు అశోకు, ప్రధాన కార్యదర్శి గడ్డం అనిల్, బాపన్న, వేముల మల్లేశం వీరి సమక్షంలో దొంతపూర్ గ్రామ నూతన కమిటీకి ఎన్నికైన అధ్యక్షుడు స్వర్గం రామచంద్రం, ఉపాధ్యక్షుడు బేతు నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామచంద్రం, కోశాధికారి స్వర్గం నారాయణ వీరిని మండల అధ్యక్షుల సమక్షంలో ఎన్నుకోబడింది,తదనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వము నుండి సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలని,వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్ధులు ఎవరైతే సంవత్సర ఆదాయం రూ. 45,000/- లోపు కలిగి ఉన్న వారికి వసతి, భోజన సదుపాయములు ఏర్పాటు చేయడమే గాక, నోటు పుస్తకములు, దుస్తులు, కాస్మెటిక్స్, ట్రంకు పెట్టెలు మరియు వివిధ రకములైన పాఠ్యపుస్తకములు మరియు వర్క్ బుక్ ఉచితముగా ఇవ్వడం జరుగుతుందని అధ్యక్షుడు అన్నారు.ఈ కార్యక్రమంలో యువకులు మరియు పద్మశాలి సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.