Wednesday, 4 November 2026

పద్మశాలి సంఘం నియోజకవర్గ అధ్యక్షులుగా గుర్రం మార్కండేయ

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పద్మశాలి సంఘం హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా గుర్రం మార్కండేయను ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణo అనంతరం,మట్టపల్లి పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నేరేడుచర్ల వాస్తవ్యుడు గుర్రం మార్కండేయ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా మార్కండేయ మాట్లాడుతూ నా నియమాకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుల వారికి కుల పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు పద్మశాలి సంఘ అభివృద్ధి కొరకు శాయ శక్తుల కృషి చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి కొంగరి నరసింహారావు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మిట్టకోల యుగంధర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు చిన్నం వీరమల్లు జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి ముషం నరసింహ మట్టపల్లి దేవాలయ కమిటీ సభ్యుడు గోలి శ్రీనివాస్,మట్టపల్లి నిత్యా అన్నదాన సత్ర కమిటీ అధ్యక్షుడు నామని కుమారస్వామి,గౌరవాధ్యక్షుడు జల్లా సత్తయ్య, నేరేడుచర్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు, మేళ్లచెరువు పద్మశాలి సంఘం అధ్యక్షుడు జిల్లా సోమలయ్య, కుల పెద్దలు పిండిప్రోలు రామచంద్రయ్య, దికొండ లక్ష్మీనారాయణ గోనె అంకయ్య,రామకృష్ణ, గోలి చిన్న వెంకటేశ్వర్లు,దీకొండ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు