Wednesday, 4 November 2026

ప్రభుత్వం స్పందించి, జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె విరమింప చెయ్యాలి

 

 

 

 

 

 

 

 

 

మోత్కూరు మే 5 జనంసాక్షి: ప్రొబేషన్ కాలం ముగిసినందున జూనియర్ పంచాయితీ కార్యదర్శుల (జేపీఎస్) లను రెగ్యులరైజ్ చేస్తూ, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా, ప్రభుత్వం స్పందించి,సమ్మె విరమింప చెయ్యాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులు 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామ పంచాయితీలలో విధులు నిర్వహిస్తున్నారని, నోటిఫికేషన్ ప్రకారం వారి ప్రోబేషన్ కాలం గత ఏడాది ఏప్రిల్ నాటికే పూర్తి అయిందని, పేర్కొన్నారు. అయిన మరో ఏడాది పెంచుతూ, ప్రభుత్వం జీవో ఇచ్చిందని,ఈ గడువు కూడ గతనెల 11 వ తేదీన ముగిసిందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదని,చెప్పిన ముఖ్యమంత్రి,జేపీఎస్ ల నాలుగేండ్ల ప్రోబేషన్ గడువు పూర్తి అయినప్పటికీ రెగ్యులర్ చేయకపోవడం సరికాదని, స్థానిక సంస్థల్లో వారి పాత్ర కీలకమైనదని,వారి న్యాయమైన డిమాండ్ లపై ప్రభుత్వం స్పందించి, సమ్మె విరమింప చెయ్యాలని, ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.