Wednesday, 4 November 2026

పద్మశాలీలందరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రుణపడి ఉంటాం సర్పంచ్ పసునూరి మధుసూదన్

 

 

 

 

 

కొడకండ్ల, మార్చి09(జనం సాక్షి) బుధవారం రోజున మహిళా దినోత్సవం సందర్భంగా తొరూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ కొడకండ్ల లో స్థాపించబోయే మినీ టెక్స్ట్ టైల్ పార్క్ ప్రకటన పట్ల కేటీఆర్ కి, కేసీఆర్ కి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి పాలాభిషేకం చేసిన కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన పద్మశాలీయులు.అనంతరం వారు కేసీఆర్, కేటీఆర్ ,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ పసునూరి మధుసూదన్,పద్మ శాలి సంఘం పెద్దలు మసురం వెంకట నారాయణ, మసురం రమేష్, పద్మశాలీ సంఘం అధ్యక్షులు పసునూరి నవీన్ మాట్లాడుతూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మినీ టెక్స్ట్ టైల్ పార్క్ కేటీఆర్ ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉందని,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఎల్లవేళలా రుణపడి వుంటామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రకటనతో వేలాది కుటుంబాలు లబ్ది పొందొచ్చని, సిరిసిల్ల లో ఉన్నటువంటి మినీ టెక్స్ట్ టైల్ లో 1200 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, అక్కడి మాదిరిగానే కొడకండ్ల లో కూడా గార్మెంట్స్,షెడ్డులు నిర్మించి యువత కు,నిరుద్యోగులకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వొచ్చని, అంతేకాకుండా ఒక పద్మశాలీ యులకే కాకుండా ఇతర కులాలకు కూడా ఉద్యోగా అవకాశాలు వస్తాయని తెలియజేసారు. అదేవిధంగా సుదూర ప్రాంతాలకు భీమండి, సూరత్,సోలాపూరుకు వలస వెళ్లిన కార్మికులకు ఈ ప్రకటన మంచి అవకాశంగా చెప్పుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్,రాములు, మల్లేష్, పద్మశాలీయులు,తదితరులు పాల్గొన్నారు.