Wednesday, 4 November 2026

పనిచేయని వీఆర్ఏ పై చర్యలు తీసుకోండి

పనిచేయని వీఆర్ఏ పై చర్యలు తీసుకోండి
పానుగల్ నవంబర్ 17,జనంసాక్షి
గురువారం రోజు మండల పరిధిలోని బండపల్లి గ్రామంలో పనిచేస్తున్న వీఆర్ఏ రాముడుపై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని,జిల్లా కలెక్టర్ కి మరియు తహసిల్దార్ యేసయ్యకు బండపల్లి గ్రామ ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని, గ్రామ ప్రజలకు గాని, ప్రజా ప్రతినిధులకు గాని చేరవేయకుండా,గతంలో వాటా బంధి పద్ధతి ప్రకారం విధులు నిర్వర్తించి, అదే పద్ధతిని ప్రస్తుతం కూడా కొనసాగాలని గ్రామసభలో తీర్మానం చేసిన, గ్రామసభ తీర్మాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, నెలసరి వేతనం తీసుకుంటున్నాడని తెలిపారు. తమ భాగస్తులు కొనసాగాలని కోరిన వారిపై గొడవలకు దిగుతున్నాడని, అతని స్థానంలో వాటా బంది పద్ధతిలో కావలి కురువమ్మ భర్త కావలి కిష్టయ్య విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, నెలసరి వేతనం మాత్రం కావలి రాముడు తీసుకుంటున్నాడని, వెంటనే నెలసరి వేతనాన్ని కావలి కురువమ్మకు వేతనం అందేటట్లు చేసి, కావలి రాముడిని విధుల నుంచి తొలగించవలసిందిగా కోరారు.ఈ సందర్భంగా తహసిల్దార్ యేసయ్య మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీఆర్ఏ రాముడిపై సంబంధిత అధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరమ్మ,ఎంపీటీసీ ప్రేమ్ కుమార్, ఉప సర్పంచ్ ఆంజనేయులు,పాఠశాల చైర్మన్ కుమార్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.