సహకార బ్యాంక్ అధికారులతో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో 69వ అఖిల భారత సహకార
వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ వారోత్సవాల కార్యక్రమ0లో ముఖ్యఅతిథిగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రైతులు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో పలు కారణాల వల్ల పంట దెబ్బతింటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారేవి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తూ సహకార సంఘం ఆదుకుంటూ రైతులకు పెద్దపీట వేస్తు0దన్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందిస్తూ పెట్టుబడి సహాయంగా సహకార వ్యవస్థ రైతులను ఆదుకుంటుందని అన్నారు. రైతులకు రుణాలు అందిస్తూ పంటను అమ్మే వరకు సహకార సంఘాలు ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి ఆందోల్ ఎంపీపీ బాలయ్య మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఆందోల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మ కాంత్ రెడ్డి ఆయా మండల డైరెక్టర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు




