పనుల్లో వేగం పెంచండి
– పోలవరం పనుల పురోగతిపై సవిూక్షించిన సీఎం చంద్రబాబు
– 53.50శాతం వరకు పోలవరం నిర్మాణ పనులు పూర్తి
– కాంక్రీట్ పనుల్లో మందగమనంపై అధికారులను నిలదీత
– త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
అమరావతి, మే14(జనం సాక్షి) : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి సచివాలయం నుంచి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు, కాంట్రాక్టర్‌లకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెల్లడించారు. జూన్ 11లోగా డయా ఫ్రమ్ వాల్‌తో పాటు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా నేరుగా పనులు తీరును వీడియో ఆధారంగా పరిశీలించిన సీఎం కాంక్రీటు పనుల్లో వేగం మందగించటంపై నిర్మాణ సంస్థలను ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు 53.50శాతం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు 89.6 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60 శాతం, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్
మట్టి పనులు 73.2 శాతం మేర పూర్తయ్యాయని వివరించారు. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 21.83 శాతం మేర పూర్తయినట్లు తెలిపారు. గోదావరి కుడిగట్టు నుంచి డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం 91 శాతం మేర పూర్తయిందని తెలిపారు. జూన్ 11 తేదీ లోగా దీనిని మొత్తం పూర్తి చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని.. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు కూడా 60.28 శాతం మేర పూర్తి చేశామని వివరించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.