మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 11.కాలనీలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా స్థానిక కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. ఇంటింటి పాదయాత్రలో భాగంగా ఆనంద్ భాగ్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కస్తూరిబా నగర్,కృష్ణానగర్ లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మంచినీరు,ఆసరా పెన్షన్ లు,కరెంటు స్తంభాలు,దోమల బెడద,డ్రైనేజీ,తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రోడ్డుపై మురుగునీరు నిలిచి నాచు పట్టి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీలలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయని,ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రజా సమస్యలపై కార్పొరేటర్,అధికారులకు పట్టింపు లేదని ఆరోపించారు.అనంతరం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉమేష్ సింగ్,వెంకటేష్ యాదవ్,సూర్య ప్రకాష్,బికే శ్రీనివాస్,బుచ్చిబాబు,
వేణు,మజీద్, అంతోని,అన్వర్,ముక్తార్,మణికంఠ, శ్రీనివాస్ గౌడ్,గుత్తి రామ్ చందర్,సిరిగిరి నర్సింగ్ రావు,పోల్కంపల్లి వెంకటేష్, జీవన్ రెడ్డి,వినోద్ యాదవ్,వంశీ ముదిరాజ్,రాములు సానాది శంకర్, చంద్రశేఖర్,కృష్ణ గౌడ్,రోజారమణీ,రజిని, ఆశ,మాధవి,ప్రభ తదితరులు పాల్గొన్నారు.




