Tuesday, 3 November 2026

పబ్లిక్ రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

శామీర్ పేట్, జనం సాక్షి :గత 25 సంవత్సరాల ముందు గ్రామ పంచాయతీ అనుమతితో వెంచర్లో వేసిన పబ్లిక్ రోడ్డును సెలబ్రిటీ యాజమాన్యం పక్షవాత దొరణీతో రోడ్డును ధ్వసం చెయ్యడమే కాక మా సంఘం స్వంత నిధులతో వేసిన మిషన్ భగీరద మంచినీటి పైపు లైనును కూడ ధ్వసం చేసి తీవ్ర మానసిక వేదనకు గురిచేయ్యడం సిగ్గు చేటని సెలబ్రిటీ విల్లా యజమానుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ
ప్రధాన రోడ్ ఆరెంజ్ బౌల్ గేట్ నుండి ఉన్న 40ఫీట్ల రోడ్ ను జేసిబితో ధ్వసం చేస్తున్న సెలబ్రిటీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే మా పై దాడికి దిగడం శోచ నీయమన్నారు.రోడ్ కు ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లను జేసిబితో పీకేయడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని తెలిపారు.150 ఎకరాల వెంచర్ లో సుమారు 84కుటుంబాలు నివసిస్తున్నామని అన్నారు.
దీనిపై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్ డి ఓ, ఎమ్మార్వో, ఫారెస్ట్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని పేర్కొన్నారు.ధ్వంసం చేసిన వారి పై ఎన్ని పిర్యాదులు చేసిన అధికారులు, పోలీసులు నిమ్మకు నీరేతినట్లు వ్యవహరించడం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు.
సెలబ్రిటీ యాజమాన్యమే ప్లాట్స్ చేసి అమ్ముకొని మళ్ళి వాల్లే కబ్జాకు పాల్ప డడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటి కైనా మా సెలబ్రిటీ విల్లావాసులకు న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చే పడుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమం లో సెలబ్రిటీ విల్లా యజమానుల సంఘం నాయకులు రాజ శేఖ రయ్య,శ్రీరంగారావు, విలా సాగరం అశోక్,
బలవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.