విద్యార్థులకు టి.డి వ్యాక్సిన్
ఝరాసంగం నవంబర్ 7( జనంసాక్షి) ఝరాసంగం
మండలంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థి విద్యార్థినిలకు మండల వైద్యాధికారి మజీద్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది టైటనస్, దీప్తిరియా నివారణ (టి.డి) వ్యాక్సిన్ వేశారు ఈ సందర్భంగా డాక్టర్ మజీద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10 నుండి 16 సంవత్సరాల విద్యార్థులకు ఈనెల 7 నుండి 19 వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలో 941 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులకు టిడిపి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సి ఎచ్ ఓ సుదర్శన్ పాఠశాల ఉపాధ్యాయులు, ఆశాలు, అంగన్ వాడి లు తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులకు టి.డి వ్యాక్సిన్




