మానకొండూరు, ఆర్ సి, మే 4 (జనం సాక్షి)
దేశ రాజధాని ఢిల్లీ వసంత విహార్ లో నిర్మించిన తెలంగాణ భవన్ ను గురువారం భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు.భారాస కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హజరయ్యారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిసి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరయ్యారు.




