హుజూర్ నగర్ మే 30 (జనంసాక్షి):
ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నందు ఎంపీపీఎస్ గోవిందపురం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొన్న వెలువడిన గురుకుల ప్రవేశ పరీక్షలో ఎంపీపీ ఎస్ గోవిందపురం పాఠశాల నుండి 19 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 15 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాభాష తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గోవిందపురం పాఠశాల సీట్లు సాధించినందుకు గాను విద్యార్థులకు సహకరించిన 8వ వార్డు కౌన్సిలర్ సౌజన్యకు, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ధనమ్మకు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శైలజకు, విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చినటువంటి దాతలకు, తల్లిదండ్రులకు, గురుకులంలో సీట్లు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధమైన సీట్లు సాధించినందుకు మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్, మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాధా దుర్గ, సిఆర్పి సైదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గొట్టే శ్రీనివాస్, ఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పరీక్షలో గోవిందపురం ప్రభుత్వ పాఠశాల ప్రభంజనం




