Tuesday, 3 November 2026

పొగాకు వాడడం వలన మనుషుల ఆయుస్సు తగ్గిపోతుంది:

మల్కాజిగిరి.జనంసాక్షి.మే31ప్రజలు పొగాకు వాడటానికి దురాంగ ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని డాక్టర్ సౌమ్య సూచించారు.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వాడకం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు.రైతులు పొగాకు ఉత్పత్తి వల్ల లాభాలు వస్తాయని ఉద్దేశంతో పొగాకు పండిస్తారని దీనివలన మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన కల్పించి,పోషక ఆహార పంటలను పండించేలా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.పొగాకు వినియోగం,ధూమపానం మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.పొగాకు వినియోగం ఒక వ్యక్తి ఆయుర్దాయం తగ్గిస్తుందని తద్వారా వారు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.పొగాకు వాడడం వలన  క్యాన్సర్,శ్వాసకోశ వ్యాధులు,గుండె జబ్బులు,దంత సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు,మధుమేహం, దృష్టి మరియు వినికిడి సమస్యలు వస్తాయని తెలిపారు.ధూమపానం చేసేవారిలో పోషకాహార స్థితి సరిగా ఉండదు అన్నారు.ధూమపానం చేయడం వల్ల శరీరంలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుందని,ధూమపానం చేసేవారికి విటమిన్ బి12 లేకపోవడం వల్ల బలహీనత,గుండె దడ,అలసట మరియు మెదడు దెబ్బతింటుందని, ధూమపానం చేసేవారికి విటమిన్ల లోపం వలన క్యాన్సర్,గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయని తెలిపారు.ప్రజలు పొగాకు ధూమపానానికి దూరం ఉండి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని సూచించారు.