అవతరణ వేడుకలకు గట్టి బందోబస్తు
హైదరాబాద్,మే31(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిఎం కెసిఆర్ అమరవీరులకు ఇక్కడ నివాళి అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేస్తారు. గవర్నర్ నరసింహన్ సహా మంత్రులు, విఐపిలు ముఖ్య అతిథులు పాల్గొంటారు. దీంతో పెరేడ్ గ్రౌంట్ వద్ద బారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడులకు 2500 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉ. 9:30 గంటలకు నుంచి మ.12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. పాసులు ఉన్నవారికి మాత్రమే పరేడ్ గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. జూన్ 2న పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
పరేడ్‌డ్రౌండ్స్ వద్ద భారీగా ఏర్పాట్లు




