Tuesday, 3 November 2026

పర్యాటకంగా కోటప్పకొండ అభివృద్దికి చర్యలు

గుంటూరు,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): కోటప్పకొండను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్పీకర్‌ కోడెల శిప్రసాద్‌ సూచనల మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాదాపు 5కోట్లతో ప్రణాళిక సిద్దంచేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం  త్వరలో పర్యటక శోభను సంతరించుకోనుంది. ఇప్పటికే ఇక్కడకు వచ్చే యాత్రికులను కొండ మధ్యలో ఏర్పాటు చేసిన పర్యావరణ పర్యాటక క్షేత్రం ఆకర్షిస్తోంది. ఇందులో అటవీశాఖ అధికారులు నూతన అందాలను తెచ్చి పెట్టే కార్యక్రమాలను చేపట్టారు. సీతాకోక చిలుకల పార్కు, జింకలు, దుప్పులు, నెమళ్లు ఇలా వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరించేందుకు వీలుగా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా  కొండ కింద నుంచి త్రికోటేశ్వరుని సన్నిధికి వెళ్లేందుకు రోప్‌వేను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.  ఏపీ పర్యటకశాఖ పర్యవేక్షక ఇంజినీర్లు అధికారులు పరిశీలించారు.  రోప్‌వే నిర్మాణానికి కొండ కింది భాగాన్ని పరిశీలించారు. కొండ మెట్లు ఎక్కే మార్గంలో ఎడమ వైపు ఉన్న సత్రం పక్క ఉన్న స్థలాన్ని చూశారు. అక్కడి నుంచి కొండ విూద వినాయకుడి విగ్రహం వరకూ రోప్‌వే మార్గం నిర్మించవచ్చని అనుకుంటున్నారు.  ప్రభుత్వస్థలం దాదాపుగా అక్కడ ఎకరం పైగానే ఉందని సర్వేయర్‌ ద్వారా తెలుసుకున్నారు. మెట్ల మార్గంలో కుడివైపు ఉన్న కోనేరు వద్ద ఎకరం స్థలంలో పర్యటకశాఖ  ¬టల్‌, ఫుడ్‌కోర్టు, పిల్లలకు ఆటస్థలం, ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *