Wednesday, 4 November 2026

జనన మరణాల నివేదికలపై ఆరా

గుంటూరు,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రెండేళ్లుగా తాడేపల్లి పట్టణం జనన మరణాల నివేదికను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి పంపకపోవడంతో వివరాలు నమోదు కావడం లేదని గుర్తించారు.గత 24 నెలల నుంచి తాడేపల్లి పట్టణంలో జనన, మరణాలకు సంబంధించి సమాచారం హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపకపోవడంపై ఇటీవల ఉన్నతాధికారులు ఆరా తీసేందుకు వచ్చారు.   తాడేపల్లి పురపాలక సంఘంలో జనన, మరణాల రికార్డులను పరిశీలించారు. పురపాలక సంఘ కార్యాలయంలో వీటికి సంబంధించి ఎలాంటి బోర్డులు ఏర్పాటు కాకపోవడంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు నమోదుకు సంబంధించి రిజిస్ట్రార్‌  కార్యాలయం ప్రతీ పురపాలక సంఘంలో పని చేయాల్సి ఉండగా ఇక్కడ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అధికారులు ఆరా తీశారు.  అయితే ఇక్కడ నమోదు చేసినా వివరాలు పంపకపోవడం వల్ల రాష్ట్ర కార్యాలయంలో రికార్డులు నమోదు కాలేదు. రెండేళ్లకు సంబంధించిన నివేదికను  హైదరాబాద్‌ కార్యాలయానికి పంపారు. పురపాలక సంఘ కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నమోదైన వివరాలనుపంపాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *