Wednesday, 4 November 2026

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, మే 5, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం స్థానిక సర్పంచ్ ఇందూరి శశికళ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల ప్రభుత్వం రైతుల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పరిసర ప్రాంతాల రైతులు ఈకొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడి నారాయణ, పాక్స్ వైస్ చైర్మన్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, సీసీ సువర్ణ, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, రైతులు రాజయ్య, తిరుపతి, మధుకర్, వెంకటయ్య పాల్గొన్నారు.