Saturday, 7 November 2026

పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ .

పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ .
రఘునాథ పాలెం డిసెంబర్ 21 జనం సాక్షి
ఖమ్మం నగరంలో స్వర్గీయ కీర్తిశేషులు పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థంగా పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ మహిళలకు సుమారుగా 100 మంది కి చీరలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు మా తండ్రి యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ* ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ పదిమందికి ఉపయోగపడుతూ ప్రజల్లో మమేకమై ఉన్నారన్నారు . జీవితాంతం ఆయన ఆశయ సాధన కోసమే కృషి చేస్తానన్నారు . మా నాన్నగారి పేరు మీద ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు . ప్రతి ఏట లాగే ఈ ఏట కూడా పేద క్రిస్టియన్ లకు తమ వంతుగా సహయం చేశారని తెలిపారు . ఈ కార్యక్రమంలో షాలోమ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు ప్రకాశం పాస్టర్ పాల్గొని ప్రార్థన చేసి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో పలువురు సంఘస్తు లు ప్రజలు పాల్గొన్నారు