Saturday, 7 November 2026

భూముల శాటిలైట్ సర్వేకు సన్నాహాలు.

భూముల శాటిలైట్ సర్వేకు సన్నాహాలు.
ఫొటో : నమూనా సర్వే చేస్తున్న అధికారులు.
నెన్నెల, డిసెంబర్ 21, (జనంసాక్షి )
భూములను శాటిలైట్ ద్వారా సర్వే చేపట్టడానికి ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శాటిలైట్ సర్వేకు నెన్నెల మండలం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అయిందని ఆఫీసర్ సర్వేయర్ శ్రీహరి తెలిపారు. శాటిలైట్ సహాయంతో డ్రోన్ల ద్వారా భూముల సర్వే పారదర్శకంగా ఉంటుందని ఆయన వివరించారు. డ్రోన్ సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డు అందజేయనున్నామని ఆయన వివరించారు. 120 మీటర్ల పై భాగంలో కెమెరా ద్వారా ఫొటోలు తీసి జీపీఎస్ కు అనుసంధానం చేస్తామన్నారు. కెమెరా 4 కిలో మీటర్ల దూరం పరిధి వరకు ఫొటోలు తీసే శక్తి ఉందన్నారు. దీని వల్ల భూ సర్వే సకాలంలో, సమగ్రంగా నిర్వహించబడుతుందని వివరించారు. ఈకార్యక్రమంలో సర్వేయర్లు వి గోపాల్ రావు, డి రవిబాబు, టి కిష్టయ్య పాల్గొన్నారు.