Tuesday, 3 November 2026

పల్లెల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ నాగపూరిలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ

 

చేర్యాల (జనంసాక్షి) మే 28 : పల్లెల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల మండల పరిధిలోని నాగపురి గ్రామంలో డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరైన నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కర్ణాకర్ మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిలో ముందుకు సాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండమీది సంతోషి- కరుణాకర్, వార్డు సభ్యులు సత్యనారాయణ, నర్సింలు, వెంకటేశం, స్వరూప-కృష్ణమూర్తి, కర్ణాకర్ అంగన్వాడీ టీచర్లు రాధ, వెంకటలక్ష్మి, కనకమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.