అలంపూర్ మే28(జనంసాక్షి)
నందమూరి తారక రామారావు జయంతిని నియోజకవర్గం లోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలోని పూర్ణచంద్రరావు సమక్షంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు జయంతి కార్యక్రమానికి హాజరై ఆయనకు పూలమాలలు వేసి జయహో ఎన్టీఆర్ అంటూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సురేష్ మహరాజ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర యువతకు ఆదర్శమని కొనియాడారు. పేద మధ్య తరగతి నుంచి వచ్చిన ఆయన ఒక నటుడిగా ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యేంత ఎదిగాడంటే ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైనది అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రూపొందించిన పథకాలు పేదలకు రెండు రూపాయల బియ్యము, ఎంసెట్, మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ, విద్యా వ్యవస్థలో పెను మార్పులను తీసుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలను పట్టిపీడించిన పట్వారి వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ నాయకులు రామ్మోహన్, టిఆర్ఎస్ నాయకులు మద్దూర్ గోవర్ధన్ రెడ్డి, సూరి తదితరులు పాల్గొన్నారు.
శాంతినగర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు




