Tuesday, 3 November 2026

పల్లెల ప్రగతికి నూతన శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 04 జనం సాక్షిపల్లె ప్రగతికి నూతన శ్రీకారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాజం రుణపడి ఉండాలని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు గురువారం” ధారూర్ మండల పరిధిలోని అవుసుపల్లి 15 లక్షలు,తిమ్మనగర్ 11 లక్షలు, లక్ష్మినగర్ తండా 5 లక్షలు* డీకే తండా 10 లక్షలు,స్టేషన్ ధారూర్ 15లక్షలు మరియు ధారూర్ మండల కేంద్రంలో 45 లక్షలు* మొత్తం రూపాయలు ఒక కోటి ఒక లక్ష* నిధులతో నూతన సీసీ రోడ్ల* ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమౌళి జెడ్పిటిసి సుజాత వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.