Wednesday, 4 November 2026

పల్లె దవాఖాన పనులను ప్రారంభించిన ఊరుకోండపేట సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి.

పల్లె దవాఖాన పనులను ప్రారంభించిన ఊరుకోండపేట సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి.
ఊరుకొండ, నవంబర్ 7 (జనంసాక్షి):
పల్లె దవాఖాన ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయని పల్లె దవాఖాన పనులను ఊరుకోండపేట సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి ప్రారంభించారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె దవాఖాన పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో పల్లె దావకాన ఏర్పాటు వల్ల వైద్య పరంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, మండల నాయకులు నాగోజి, అశోక్ రెడ్డి, సిద్దు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.