Tuesday, 3 November 2026

పల్లె నిద్రతో ప్రజలకు చేరువ

సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న స్పీకర్‌
వరిధాన్యం తూర్పార బట్టిన చారి
హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): పల్లె నిద్రతో ప్రజలతో మమేకం అవుఉతన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి వారి పనుల్లో కూడా మమేకం అయ్యారు. తాజాగా వరి ధాన్యం తూర్పార బట్టారు. ఓ రైతు వరికల్లం వ్దదకు వెళ్లి చాటందుకుని ధాన్యం తూర్పారా బట్టారు.  జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు ఖాసీంప్లలెలో ఆయన రాత్రి బస్తీ ప్రగతి నిద్ర చేశారు. ఉదయం ఖాసీంప్లలెలోని పెద్ద చెరువును పరిశీలించి, నాలుగు రోజుల క్రితం  వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబయ్య అనే రైతు తన వరి పంటను తూర్పార పడుతుండడంతో అక్కడికి వెళ్లి కాసేపు పనిలో సాయం చేశారు. అంతకుముందు, ఉదయం 6 గంటల నుంచే స్పీకర్‌ మధుసూదనాచారి ప్రజలను కలిశారు. వారి సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న రోడ్లు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాసీంప్లలెలో ఇప్పటికే 18 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి జరిగిందని, త్వరలో ప్రధాన రహదారి నిర్మాణం చేపడతామని అన్నారు. ఆ తర్వాత స్వయంగా మోటార్‌ సైకిల్‌ నడుపుకుంటూ కట్లూరి ప్లలె, బొంతల వాడ, మేకల వాడ, చెన్నగూడెం పెద్దచెరువు కట్ట విూదుగా పలుచోట్ల ప్రజలను కలిశారు. పార్టీ ముఖ్య నాయకుల కుటుంబ సభ్యులను పలకరిస్తూ భూపాలపల్లికి చేరుకున్నారు.