కొడకండ్ల,04(జనం సాక్షి) కొడకండ్ల మండల కేంద్రంలో, రామవరం గ్రామాల పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్,డి ఆర్ డి ఓ రామ్ రెడ్డి,ఈ జి ఎస్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య ఆకస్మిత తనిఖీ చేశారు. అనంతరం ఆడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు వాటరింగ్ చేస్తూ మొక్కలను కాపాడాలని శుభ్రంగా హాలదాకరంగ ఉండేలా చూడాలని, రామావరలో నర్సరీ తడి చెత్త పొడి చెత్త షెడ్/ పల్లె ప్రకృతి వనాలు విజిట్ చేసి బాధ్యతగా వ్యవహరించి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వారం రోజుల్లో ఎక్కడ కూడా పిచ్చి గడ్డి బుషెస్ ఉండకుండా శుభ్రoగా లేని యెడల క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేసి అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి విధులకు లేటుగా హాజరైన వాళ్ళు హెచ్చరించి జనగామ డిఎంహెచ్ఓ కు ఫోన్ చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని తేలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో ఇందిరా,సర్పంచ్ మందుల శిరీష రామారావు ఎంపీటీసీ మణెమ్మ,యం పి ఓ, శ్రీనివాస్, ఏ పి ఓ కుమారస్వామి గౌడ్, పంచాయతీ కార్యదర్శి నాగమణి,ఉప సర్పంచ్లు, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులు గ్రామ పెద్దలు, ఉపాధి కూలీలు, వాచర్లు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి,నర్సరీలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్




